ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి కిర్రెక్కించే వార్త‌!

మరిన్ని వార్తలు

గ‌బ్బ‌ర్ సింగ్ - ఈ పేరు చెబితే, ప‌వ‌న్ ఫ్యాన్స్ ఇప్ప‌టికీ తీన్ మార్ ఆడేస్తుంటారు. ఎందుకంటే ఆ సినిమా చేసిన మాయాజాలం అలాంటిది. ఓ రీమేక్ ని ఇలాక్కూడా తీయొచ్చా? అనుకునేలా ఆ సినిమాని తెర‌కెక్కించాడు హ‌రీష్ శంక‌ర్‌. నేటితో గ‌బ్బ‌ర్ సింగ్ కి ఎనిమిదేళ్లు. ఎనిమిదేళ్లుగా ఈ సినిమా గురించి ఫ్యాన్స్ ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ప‌వ‌న్ - హ‌రీష్ ల కాంబో మ‌రోసారి రీపీట్ అవ్వ‌బోతోంది. మైత్రీ మూవీస్ ఈ సినిమాని నిర్మిస్తోంది.

 

ఇప్పుడు మ‌రో గుడ్ న్యూస్‌. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ ని సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంచుకున్నార‌ని మైత్రీ మూవీస్ ప్ర‌క‌టించింది. అంటే ప‌వ‌న్ - హ‌రీష్ - దేవిశ్రీ ఈ మాయాజాలాన్ని మ‌రోసారి చూడొచ్చ‌న్న‌మాట‌. ప‌వ‌న్ సినిమాల‌కు దేవి ఎప్పుడూ అదిరిపోయే సంగీతాన్నే అందించాడు. అందులో గ‌బ్బ‌ర్ సింగ్ మ‌రింత ప్ర‌త్యేకం. ఆ సినిమాలోని పాట‌లే కాదు, బీజియ‌మ్స్ కూడా సూప‌ర్ హిట్టే. మ‌రోసారి ప‌వ‌న్‌కి దేవి ఎలాంటి పాట‌లు ఇస్తాడో అనే ఆస‌క్తి ఇప్ప‌టి నుంచే మొద‌లైపోయింది. మ‌రి ఈ మ్యాజిక్ ఎలా ఉంటుందో..?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS