తెలుగు సినీ పరిశ్రమ ‘లాక్‌డౌన్’ ఎత్తివేత కోసం ఎదురుచూస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 3వ వారం నుంచి తెలుగు సినిమాల రిలీజ్‌లు ఆగిపోయాయి. దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో స్తబ్దత నెలకొంది. సినిమా ది¸యేటర్లు మూగబోయాయి. సినిమా షూటింగులూ జరగడంలేదు. ఈ నెలాఖరు తర్వాతగానీ, సినిమా షూటింగులకు అనుమతి లభించే అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది. పోనీ, జూన్ మొదటి వారంలో అయినా సినిమా షూటింగులకు అనుమతి వస్తుందా.? రాదా.? అన్న దిశగా సినీ పరిశ్రమ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఇదిలా వుంటే, రేపటినుంచి రైళ్ళు తిరగనుండడం, మే 18 నుంచి బస్సులు తిరిగేందుకు వీలుగా ప్రభుత్వాలు కార్యాచరణ రచిస్తుండడంతో, సినిమా దియేటర్లూ అతి త్వరలో తెరుచుకోబోతున్నాయనే ఆశాభావం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఒకవేళ జూన్ 1 నుంచి సినిమా దియేటర్లు తెరుచుకునేందుకు వీలు కలిగితే, వెంటనే విడుదలయ్యేందుకు కొన్ని సినిమాలు సిద్ధంగానే వున్నాయి టాలీవుడ్‌కి సంబంధించి. అయితే, ఇప్పట్లో సినిమా ది¸యేటర్లకు అవకాశం ఇవ్వడం కష్టమేనన్న వాదనలూ లేకపోలేదు. బస్సుల్లో సీట్లు తగ్గించి అదనపు ఛార్జీలు వసూలు చేయొచ్చు.. రైళ్ళలోనూ అదే పరిస్థితి వుండొచ్చు. సినిమా ది¸యేటర్లలో అది సాధ్యమేనా.? టిక్కెట్ల రేట్లు పెంచితే, ది¸యేటర్లకు జనం రావడం సాధ్యమయ్యే పని కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏమో, ముందు ముందు ఏం జరుగుతుందోగానీ, సినీ పరిశ్రమ మాత్రం ఇప్పటికే దారుణమైన నష్టాల్లోకి కూరుకుపోయింది.