మన తెలుగు సినిమాలు ఎన్ని రికార్డులు బద్దలు కొడతాయో తెలీదు కానీ, క్రమం తప్పకుండా ఎవరివో ఒకరి మనోభావాన్ని దెబ్బ తీయడం మాత్రం కామన్. ఈమధ్య `మనోభావాలు` మరింత సున్నితమైపోయాయి. చిటీకీ మాటికీ... ఘోరంగా దెబ్బతింటున్నాయి. తాజాగా... దేవిశ్రీ ప్రసాద్ పాట కూడా ఈ పాపంలో పాలుపంచుకొంది. టీ సిరీస్ కోసం దేవిశ్రీ ఓ వీడియో సాంగ్ చేశారు. విడుదలై కూడా చాలా రోజులైంది. ఆ పాట యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఇప్పుడు ఈపాటపై వివాదం చెలరేగింది. ఈ పాట హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని, ఈ పాటని వెంటనే తొలగించాలని, దేవిశ్రీతో పాటు ఈ పాట రూపకర్తలు హిందువులకు క్షమాపణలు చెప్పాలని హిందీ సంఘాలు ఘోషిస్తున్నాయి. ఈ మేరకు దేవిశ్రీ పై కరాటే కల్యాణీ హైదరాబాద్ లో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇంత జరిగినా.. దీనిపై దేవి ఇప్పటి వరకూ స్పందించలేదు. సోషల్ మీడియా ద్వారా కూడా తన అభిప్రాయం వ్యక్తపరచలేదు. దేవి తీరు చూస్తుంటే... ఇదంతా ఆయనకు లైట్ గా కనిపించినట్టుంది. ఇది వరకు కూడా అంతే . ఊ అంటావా.. మామా.. పాట విషయంలో ఇలాంటి గొడవే జరిగింది. పాట విడుదలైనప్పుడు పెద్దగా పట్టించుకోలేదు కానీ, కాంట్రవర్సీ అయ్యాక ఆ పాట ఇంకాస్త పాపులర్ అయిపోయింది. ఇప్పుడు దేవి వీడియో గీతంకూడా అంతే. అంతలా హిందూవుల మనోభావాలు దెబ్బతీసేలా అందులో ఏముందబ్బా? అంటూ తెలియని వాళ్లు కూడా చూడడం మొదలెట్టారు.అప్పుడు కూడా దేవిశ్రీ నోరు మెదపలేదు. కాలక్రమంలో పుష్ప వివాదాన్ని మర్చిపోయారు జనాలు. ఇప్పుడు ఈ పాటని నెత్తినపెట్టుకొన్నారు. అందుకే దేవిశ్రీ ఇలాంటివి లైట్ తీసుకొన్నట్టున్నా