ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేశిశ్రీ ప్రసాద్ హీరోగా సినిమా అంటూ అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి. వార్తలేంటీ.? దేవిశ్రీ ఒప్పుకుంటే, తానే ఆ సినిమా నిర్మిస్తానంటూ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కూడా మాటిచ్చేశారు. దేవిశ్రీకి అత్యంత సన్నిహితుడైన బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్, దేవి కోసం అద్భుతమైన స్క్రిప్టు ఇచ్చేందుకూ సిద్ధమే అనుకున్నారు. ఇలా ఈ ముగ్గురి కాంబినేషన్లో హీరోగా దేవి ఎంట్రీ ఇవ్వనున్నాడంటూ ఠాం ఠాం మోత మోగిపోయింది అప్పట్లో. అయితే, టాలీవుడ్లో మోస్ట్ బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. క్షణం తీరిక లేకుండా, మ్యూజిక్ కంపోజేషన్తో సూపర్ హిట్స్ మీద సూపర్ హిట్స్ కొడుతూ కెరీర్‌ని జెట్ స్పీడుతో దూసుకెళ్లిపోతున్నాడు. ఈ మధ్యనే ఓ బాలీవుడ్ ఆఫర్ కూడా పట్టేశాడు. లేటెస్ట్గా 'సరిలేరు..'తో మరో హిట్ కొట్టేశాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందంటూ దేవిశ్రీ పేరు మార్మోగిపోతోందీ సినిమాకి.
'సరిలేరు..' ప్రమోషన్స్‌లోనూ హీరో మహేష్, డైరెక్టర్ అనిల్‌తో కలిసి దేవిశ్రీ కూడా హుషారుగా పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన హీరో ఎంట్రీ టాపిక్ మళ్లీ సోదిలోకి వచ్చింది. అయితే, మన దేవి ఏం సమాధానమిచ్చారో తెలుసా.? మ్యూజిక్‌తో బిజీగా ఉన్న కారణంగా నటనపై ఆసక్తి చూపించలేకపోతున్నాను. కానీ, సంగీత నేపథ్యంలో వచ్చే సినిమాలేమైనా ఉంటే హీరోగా నటిస్తాను.. అని రిథమిక్‌గా దేవి సమాధానమిచ్చారు. ఇదిలా ఉంటే, దేవిశ్రీకి హీరోగా కోలీవుడ్ నుండి కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయట ఇది విశేషం కదా.