ప్రీరిలీజ్ ఈవెంట్ లో సినిమా గురించి చెప్పడం కామన్. కానీ కాస్త వెరైటీ గా సినిమా రివ్యూ కూడా చెప్పింది ధమాకా టీమ్. రవితేజ ధమాకా డిసెంబర్ 23న వస్తోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో ధమాకా రివ్యూ ఇచ్చాడు హైపర్ ఆది.
''ధమాకాలో మంచి పాత్ర చేశా. ధమాకాలో అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. సినిమా చూశాను కాబట్టి.. రివ్యూ ఇస్తాను. ధమాకా ప్లస్ పాయింట్స్.. రవితేజ ఎనర్జీ , ఎంటర్ టైన్ మెంట్, శ్రీలీల గ్లామర్ , నటన, కామెడీ, బీమ్స్ మ్యూజిక్, ప్రసన్న కుమార్ డైలాగ్స్, నక్కిన త్రినాథరావు గారి డైరెక్షన్.
ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ ఏమిటంటే .. సినిమా ఇంకాసేపు వుంటే బావున్ను అనిపిస్తుంది. ఫైనల్ వర్డిక్ట్ .. ఒకసారి చూడండి .. వీలైతే రెండోసారి చూడండి'. సినిమాని థియేటర్ లో చూడండి.. ఎంటర్ టైన్ మెంట్ పీక్స్'' అని చెప్పుకొచ్చాడు. ఆది రివ్యూ బాగానే వుంది కానీ అసలు సినిమా ఎలా వుంటుందో తెలియాలంటే ఇంకో మూడు రోజులు ఆగాలి.