చిత్రసీమలో మరో వివాహబంధం విడాకులతో ముగిసింది. తమిళ స్టార్ కథానాయకుడు ధనుష్.. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఇద్దరూ భార్యాభర్తలన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ విడాకులు తీసుకుని అభిమానులకు షాక్ ఇచ్చారు. ఈ విషయాన్ని ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 2004లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. 18 ఏళ్ల తర్వాత ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు.
`` మేం 18 సంవత్సరాల పాటు కలిసి ఉన్నాము. స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా , శ్రేయోభిలాషులుగా .. ఇలా ఎన్నో రకాలుగా కలిసి జీవించాం. కాని ఈరోజు ఐశ్వర్య , నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాము. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి . ఇన్ని రోజులు మాపై ఎంతటి ప్రేమాభిమానాలు చూపారో ఇప్పుడు కూడా మాకు అవసరమైన గోప్యతను అందించండి . ఓం నమశివాయ! ఇట్లు ప్రేమతో మీ ధనుష్`` అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు ధనుష్. ఇదే పోస్ట్ ని ఐశ్వర్య తన ట్విట్టర్ లో అభిమానులతో పంచుకుంది. ఇద్దరూ ఏక కాలంలో, ఒకే లేఖని అభిమానులతో పంచుకోవడం విశేషం.