ధనుష్ కొత్త సినిమా ఖరారైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు ధనుష్. ఈ రోజు సినిమా ప్రారంభమైనయింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా విడుదల కానుంది. అమిగోస్ క్రియేషన్స్ తో కలిసి శ్రీ సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని భారీ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం 'సార్' సినిమా చేస్తున్నాడు ధనుష్. ఇది తెలుగులో విడుదల కానుంది. ఈలోగ మరో బైలింగ్వల్ ని ఓకే చేశాడు. ధనుష్ విలక్షణమైన నటుడు. శేఖర్ కమ్ముల విలక్షణమైన సినిమాలకు పెట్టింది పేరు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా కుదరడం ఆసక్తిని రేపుతోంది. త్వరలోనే సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తారు.