ఉప్పెనతో ఓ సూపర్ డూపర్ హిట్ అందుకొన్నాడు సుకుమార్ శిష్యుడు... బుచ్చిబాబు. అంత పెద్ద హిట్ కొట్టాక.. ఏ దర్శకుడూ ఖాళీగా ఉండడు. కానీ.. బుచ్చి దాదాపు యేడాదిన్నర ఖాళీగా ఉండిపోయాడు. ఎన్టీఆర్‌కి కథ చెప్పాడు కానీ అది సెట్ అవ్వలేదు. దాంతో బుచ్చి పరిస్థితి ఏమిటా? అనే అనుమానం వచ్చింది. మళ్లీ ఉప్పెన లాంటి చిన్న సినిమానే తీస్తాడని కూడా ప్రచారం జరిగింది. అయితే.. బుచ్చి పంట పండింది. ఎన్టీఆర్‌తో కుదర్లేదు కానీ, రామ్ చరణ్‌తో పక్కా చేయించేశాడు.
అవును... బుచ్చిబాబు - రామ్ చరణ్‌ల కాంబో ఖాయమైపోయింది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు చరణ్. అది పూర్తయిన వెంటనే.. బుచ్చిబాబు సినిమా పట్టాలెక్కుతుంది. ఎన్టీఆర్ కోసం `పెద్ది` అనే స్పోర్ట్స్ డ్రామాని సిద్ధం చేశాడు బుచ్చిబాబు. ఇప్పుడు అదే కథని చరణ్‌తో తీస్తున్నాడని టాక్.