ఆది సాయికుమార్‌తో 'బుర్రకథ' అనే సినిమాని తెరకెక్కించాడు డైమండ్ రత్నబాబు. ప్రముఖ రచయితగా డైమండ్ రత్నబాబుకు మంచి పేరుంది. ఆయన తొలిసారి డైరెక్టర్‌గా మారి తెరకెక్కించిన కథే ఈ 'బుర్రకథ'. రెండు మెదడులు ఉన్న వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడన్న కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ రెండు బుర్రల కథని జనం ఎలా రిసీవ్ చేసుకున్నారో తెలియాలంటే ఇంకాస్త టైం పడుతుంది కానీ, ఈ లోగా ఈ సినిమా డైరెక్టర్ గురించి కొన్ని విషయాలు ముచ్చటించుకుందాం. కొత్త డైరెక్టర్ కదా.. అన్ని విషయాల్నీ చాలా జాగ్రత్తగా చూసుకున్నారట. నిర్మాతలకు బడ్జెట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారట డైమండ్ రత్నబాబు. 50 రోజుల్లో పూర్తి కావల్సిన షూటింగ్‌ని 46 రోజుల్లోనే పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నారట. ఇక ఈయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే, తన డైరెక్షన్‌లో రెండో సినిమాని అప్పుడే కన్‌ఫామ్ చేసేసుకున్నారట ఈయన. అదేంటో తెలుసా? 'బుర్రకథ' రీమేక్ అట.
'బుర్రకథ' తెలుగులో రిజల్ట్ ఎలా ఉన్నా, తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేయాలన్నదే ఆయన కోరికట. అయినా, ఈ సినిమా విజయంపై ఆయన ఎంతో నమ్మకంగా వున్నారు. ఇదిలా ఉంటే, ఈ రోజు సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఓ బేబీ' కూడా రిలీజయ్యింది. భారీ అంచనాలున్న 'ఓ బేబీ'ని తట్టుకుని 'బుర్రకథ' నిలబడుతుందా.? ఏ సినిమాకి ఎన్నెన్ని మార్కులేశారో ఆడియన్స్ తెలియాలంటే ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకూ ఆగాల్సిందే తప్పదు.