'సైకో సయ్యా.. స్టైలిష్‌ టీజింగ్‌ అదిరిందయ్యా!

By iQlikMovies - July 05, 2019 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

'సాహో' సినిమా నుండి తాజాగా కొత్త టీజర్‌ వదిలారు. ఇంతవరకూ విడుదల చేసినవన్నీ యాక్షన్‌ టీజర్స్‌. ఇది క్లాస్‌ టీజర్‌. అదీ ఓ సాంగ్‌ టీజర్‌. ఆ సాంగే 'ఆగడిక సయ్యా సైకో..' అంటూ సాగే ఈ సాంగ్‌ టీజర్‌లో శ్రద్ధాకపూర్‌ వయ్యారి వంపులతో డాన్సులు ఇరగదీసేసింది. శ్రద్ధాకపూర్‌ ఉన్నందువల్లనో ఏమో, ఈ టీజర్‌ చూస్తుంటే, ఇదేదో బాలీవుడ్‌ టీజర్‌లానే అనిపించింది. కానీ, అక్కడున్నది మన బాహుబలి, యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రబాస్‌.

 

అయితే, ఈ టీజర్‌లో ప్రబాస్‌ సింగిల్‌ షాట్‌లో కనిపించాడంతే. కొద్ది సెకన్ల పాటున్న ఈ టీజర్‌లో ఎక్కువ ఫోకస్‌ శ్రద్ధా మీదే ఉంచారు. 'సాహో' నుండి వచ్చిన తొలి సాంగ్‌ టీజర్‌ ఇది. అయితే, ఈ టీజర్‌ పట్ల ఫ్యాన్స్‌ రెస్పాన్స్‌ ఎలా ఉందయ్యా అంటే.. మిశ్రమ స్పందన వ్యక్త పరుస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్న ఫ్యాన్స్‌ ఈ సాంగ్‌ టీజర్‌పై అంతగా శాటిస్‌ఫై కాలేదనీ తెలుస్తోంది. జిబ్రాన్‌ సంగీత సారధ్యంలో విడుదలైన ఈ ఫస్ట్‌ సింగిల్‌లో హీరోని, హీరోయిన్‌ టీజ్‌ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది.

 

శ్రద్ధాకపూర్‌ షార్ప్‌ లుక్స్‌ ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తున్నాయి. జూలై 8న ఫుల్‌ సాంగ్‌ విడుదల చేయనున్నామని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి సుజిత్‌ దర్శకుడు. ఆగస్ట్‌ 15న రిపబ్లిక్‌ డే సందర్భంగా 'సాహో' విడుదల కానుంది. ప్రస్తుతం రెండు పాటలు మినహా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS