గత వారం విడుదలైన 'ఓ బేబీ' హిట్ టాక్ సంపాదించుకుంది. సమంత నటనకు, నందినిరెడ్డి దర్శకత్వ ప్రతిభకు మంచి మార్కులు పడుతున్నాయి. ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. 'ఓ బేబీ'కి పోటీ ఇచ్చే సినిమా లేకపోవడంతో... బాక్సాఫీసు దగ్గర 'బేబీ' దూసుకుపోతోంది. తొలి వారంలో 11 కోట్ల షేర్ సంపాదించింది.
నైజాంలో 3 కోట్లు సాధించిన బేబీ, సీడెడ్‌లో కోటి రూపాయలకు పరిమితమైంది. ఓవర్సీస్లో 2.5 కోట్లు తెచ్చుకుంది. ఏ సెంటర్లతో పోలిస్తే సీ సెంటర్లలో బేబీ వసూళ్లు కాస్త బలహీనంగా ఉన్నాయి. వీకెండ్ లో ఉన్న జోష్.. వీక్‌డేస్‌లో కనిపించలేదు. పైగా వరల్డ్ కప్ మ్యాచులు బేబీ స్పీడుకు బ్రేకులు వేశాయి. ఈ వారం విడుదలైన సినిమాలకు అంతంత మాత్రంగానే టాక్ దక్కింది.
ఈ నేపథ్యంలో ఈ వారాంతం మళ్లీ బేబీకి ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి. రెండోవారం బేబీ వసూళ్లు మరింత నిలకడగా ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికీ ఫ్యామిలీ సినిమాకి ఛాయిస్... ఓ బేబీనే. కాబట్టి - బేబీ జోరు ఇంకొన్ని రోజులు కొనసాగే అకాశాలున్నాయి.