నాగచైతన్య - సమంతలు విడిపోవడం అభిమానులకు షాకిచ్చే విషయమే. అయితే వీరిద్దరూ విడిపోతారని నాగార్జున ముందే ఊహించాడు. చైతూ తో సమంత విడిపోతే ఏం చేయాలి? అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? భరణం ఎంత ఇవ్వాలి? అనే విషయంపై పెళ్లికి ముందే ఓ ఎగ్రిమెంట్ చేయించుకున్నారని సమాచారం. నిజంగా ఇది విస్మయ పరిచే విషయమే.
చైతూ తో సమంత పెళ్లి కుదిరినప్పుడే.. సమంతతో నాగార్జున ఓ ఎగ్రిమెంట్ చేయించుకున్నార్ట. భవిష్యత్తులో విడిపోతే, అప్పుడు తమ కుటుంబం నుంచి ఎలాంటి భరణం అడక్కూడదన్నది ఆ ఎగ్రిమెంట్ సారాంశం. దానికి సమంత కూడా అంగీకరించి సంతకం పెట్టిందని తెలుస్తోంది. ఈ ఎగ్రిమెంట్ వ్యవహారం మొత్తం సురేష్ బాబు ఆధ్వర్యంలో, ఆయన ప్రధాన సాక్షిగా నడిచిందని తెలుస్తోంది.
ఉన్నత కుటుంబానికి చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని విడిపోతే, భార్యకు పెద్ద మొత్తంలో భరణం చెల్సించాల్సి ఉంటుంది. సమంతకు దాదాపు 200 కోట్లు భరణంగా వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ లో టాక్ వినిపించింది. నిజానికి చైతూకి ఉన్న ఆస్తులతో పోలిస్తే 200 కోట్లు చాలా తక్కువ. అయితే సమంత ఆ రెండొందల కోట్లని కూడా తిరస్కరించిందని చెప్పుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం సమంతకు చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండానే విడాకుల ప్రక్రియ ముగించేశారు. దానికి ముందు చేసుకున్న ఎగ్రిమెంట్ ని సాకుగా చూపించారు. ఇదంతా నాగ్, సురేష్ బాబు మార్క్ తెలివితేటలకు నిదర్శనం. సినీ స్టార్ల వైవాహిక జీవితాలు సవ్యంగా ఉండవని వాళ్లకు ముందే తెలుసు. అందుకే సమంతతో ఎగ్రిమెంట్ చేయించారు. ఇప్పుడు సమంత చేతుల్లో విడాకుల కాగితాలు తప్ప, ఇంకేం లేవు.