హీరో రామ్ గాయపడ్డాడు. లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్. ఈ సినిమా కోసం రామ్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకుంటున్నాడు. ఇందుకోసం భారీగా వర్క అవుట్స్ చేస్తున్నాడు. ఇందులో బాగంగా జిమ్ లో కసరత్తులు చేస్తుండగా గాయపడ్డాడు. ఆయన మెడకు గాయమైంది. దీంతో సినిమా షూటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు యూనిట్ తెలిపింది.
యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. రామ్ ఇప్పటివరకూ పోలీసు పాత్రని చేయలేదు. స్మార్ట్ శంకర్ తర్వాత మాస్ ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ ని కంటిన్యూ చేస్తూ ఈ సినిమా కధని డిజైన్ చేశారని తెలుస్తుంది. ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి ఇందులో హీరోయిన్. ఇప్పటికే దాదాపు 50 శాతంకుపైగా షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్.