దిల్‌రాజు కేవలం నిర్మాత మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూటర్ కూడా. దిల్‌రాజుకు డిస్ట్రిబ్యూటర్‌గా చాలా మంచి పేరుంది. దిల్ రాజు పట్టుకుంటే ఆ సినిమా సూపర్ హిట్టే. ఇది ప్రచారం కాదు నిజమే కూడా. నిర్మాతగా సక్సెస్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా చెబుతారు దిల్‌రాజుని. ఫ్యామిలీ ఎమోషన్స్‌కీ, రిలేషన్స్‌కీ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది దిల్ రాజు సినిమాల్లో.
ఈ ఏడాది మొత్తం ఆరు సినిమాలకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఏడాది మొదట్లోనే శర్వానంద్ నటించిన 'శతమానం భవతి' సినిమాతో బిగ్గెస్ట్ హిట్‌ని అందుకున్నాడు నిర్మాతగా దిల్‌రాజు. తర్వాత అల్లు అర్జున్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'డీజె' ఆశించిన అంచనాలను అందుకోలేకపోయినా, సక్సెస్‌గానే చెప్పుకోవాలి. ఆ తర్వాత నాని 'నేను లోకల్' సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఈ ఏడాది బిగ్టెస్ట్ హిట్స్‌లో 'ఫిదా' ఒకటి. ఫీల్ గుడ్ రొమాంటిక్ స్టోరీగా 'ఫిదా'తో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది ఈ సినిమా.
రవితేజతో 'రాజా ది గ్రేట్' సినిమా కూడా పోజిటివ్ టాక్‌తో సక్సెస్ బాటలో నిలిచింది. . ఇక నానితో 'ఎంసీఏ - మిడిల్‌క్లాస్ అబ్బాయి'తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు దిల్ రాజు. ఈ సినిమా మరో రెండు రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది ఈ సినిమాకి. లక్కీ బ్యూటీ సాయి పల్లవి, నానితో జత కడుతోంది ఈ సినిమాలో. భూమిక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకి విడుదలకు ముందే పోజిటివ్ వైబ్స్ వస్తున్నాయి.
ఈ రకంగా దిల్ రాజు ఈ ఏడాది టాప్ ప్రొడ్యూసర్‌గా నిలిచారు.