దువ్వాడ జగన్నాధం చిత్రం బ్లాక్ బస్టర్ అనిపించుకునేలా కలెక్షన్స్ రాబడుతున్న సమయంలో ఈ సినిమా పై పైరసీ ప్రభావం పడింది.
ఇక ఈ పైరసీని అరికట్టే ప్రయత్నంలో భాగంగా నిర్మాత దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్ హైదరాబాద్ లోని సిసిఎస్ పోలీసులని కలిసి తమ వద్ద ఉన్న పైరసీ లింక్ వివరాలను వారికి అందచేశారు. ఈ వివరాలతో పాటుగా DJ పైరసీ ప్రింట్స్ అప్లోడ్ చేసిన కొంతమంది పేస్ బుక్ ఐడీలను సైతం పోలీసులకి ఇచ్చినట్టు సమాచారం.
పోలీసులు కూడా వీటి పై వెంటనే విచారణ జరిపి నేరస్తులని పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ జోరు కొనసాగిస్తున్నది.