తారక్ నటిస్తున్న జై లవ కుశ చిత్రం టీజర్ ఫుటేజ్ లీకవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.
అయితే వెంటనే స్పందించిన నిర్మాత కళ్యాణ్ రామ్ హైదరాబాద్ లోని CCS పోలీసులని సంప్రదించారు. పరిస్థితి తీవ్రతను అర్ధంచేసుకున్న పోలీసులు వెంటనే ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న గణేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది.
దీని పై కళ్యాణ్ రామ్ CCS పోలీసులని స్వయంగా కలిసి కంప్లయింట్ ఇవ్వడం జరిగింది. ఇక లీకైన ఫుటేజ్ కూడా రఫ్ గా కట్ చేసింది అని అదేమీ ఫైనల్ కట్ కాదు అని చిత్ర వర్గాలు తెలిపాయి.