తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టాప్ నిర్మాతల-డిస్ట్రిబ్యూటర్ ల లిస్టులో దిల్ రాజు ఒకరు. సినిమా పరంగా ఈయన జడ్జిమెంట్ కి చాలా మంచి పేరుంది, ఈయన పేరు వేసుకుంటే ధియేటర్ కి ప్రేక్షకులు వచ్చేస్తారు అన్న అభిప్రాయం నెలకొనడంతో ఆయన మాటకి విలువ వచ్చింది.
ఇక వివరాల్లోకి వెళితే, పూరి జగన్నాధ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన మెహబూబా చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేశాడు, సినిమా విడుదలకి ముందే చూసి, ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అని మీడియా సాక్షిగా నమ్మకంగా చెప్పేశాడు.
అయితే ఈ సినిమా విడుదలవ్వడం, పూరి కెరీర్ లోనే అతిపెద్ద ఫ్లాప్ గా నిలవడంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు నిర్ఘాంతపోయారు. సినిమా తీసిన పూరి కన్నా ఈ సినిమా బాగుంటుంది అని చెప్పిన దిల్ రాజు కే ఈ సినిమా ప్రభావం ఎక్కువ చూపింది. సుమారు రూ 10 కోట్లకి ఈ సినిమాని కొని విడుదల చేసిన దిల్ రాజు కి భారీ ఎత్తున నష్టం వచ్చిందట.
మొత్తానికి ఈ సినిమా వల్ల దిల్ రాజు కి ఆర్ధిక నష్టం తో పాటు ఆయన మాట పైన నమ్మకం కూడా తగ్గినట్టయింది.