నిఖిల్ ‘కార్తికేయ-2’ని నిర్మాత దిల్ రాజు ఇబ్బంది పెట్టారని, ఈ సినిమా పలుమార్లు వాయిదా పడటానికి దిల్ రాజు కారణమని చాలా వార్తలు వచ్చాయి. ఐతే ఈ వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చాడు నిఖిల్. ‘‘దిల్ రాజు మా చిత్రాన్ని వాయిదా వేసుకోమన్నారని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందంటే దానికి ఓ కారణం ఆయనే. అందుకు ఆయనకు థ్యాంక్స్' చెప్పాడు నిఖిల్.
ఐతే ఇదే సందర్భంలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ పాత్రని ప్రస్తావించాడు. ఒకే సమయంలో ఇద్దరు హీరోల సినిమాలు విడుదలైతే రెవెన్యూకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని.. కాబట్టి వాయిదా వేసుకోవాలని దాదాపు 15 మంది మమ్మల్ని అడిగారు. వాళ్ల మాట ప్రకారం మొదట వాయిదా వేశాం. మరో హీరో సినిమా వస్తోందని.. మరోసారి వాయిదా వేశాం. మంచి సినిమా వాయిదా పడుతుందని మాత్రం బాధపడ్డా ’’ అని నిఖిల్ చెప్పుకొచ్చారు.
శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయకు పాజిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.