బింబిసార.... బాక్సాఫీసు దగ్గర హల్ చల్ చేస్తోంది. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. తొలి మూడు రోజుల్లోనే బయ్యర్లు సేఫ్ జోన్‌లో పడిపోయారు. ఆ తరవాత వచ్చిందల్లా లాభమే. ఈ సినిమాతో దర్శకుడిగా వశిష్ట పేరు కూడా మార్మోగిపోతోంది. వశిష్ట తో ప్రాజెక్టులు ఓకే చేయించడానికి ప్రొడ్యూసర్లు అడ్వాన్సులతో రెడీ అవుతున్నారు. ఇప్పటికే గీతా ఆర్ట్స్ నుంచి వశిష్టకి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా చేయడానికి వశిష్ట్ అడ్వాన్స్ కూడా అందుకొన్నాడని సమాచారం.
అయితే వశిష్ట్ ఇప్పుడు `బింబిసార 2` పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం బింబిసార 2కి సంబంధించిన కథా చర్చలు మొదలయ్యాయి. బింబిసార 1 సమయంలోనే 2 చేయాలన్న ఆలోచన ఉంది.కాబట్టి.. పార్ట్ 2 లో ఏం చెప్పాలన్న విషయంలో ఓ క్లారిటీ ఉంది. సో.. స్క్రిప్టు రూపొందించడానికి పెద్దగా సమయం అవసరం లేదు. పార్ట్ 2కి చక చక లాగించేసి, ఆ తరవాత గీతా ఆర్ట్స్ సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడు వశిష్ట. గీతా ఆర్ట్స్‌లో ఏ హీరోతో సినిమా ఉంటుందన్న విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బహుశా.. అల్లు శిరీష్ తో ఈ సినిమా ఉండొచ్చు.