`ఎఫ్ 2` సాధించిన సూపర్ సక్సెస్‌తో దిల్‌రాజు మొహంలో కొత్త కళ కనిపిస్తోంది. రూపాయికి 4 రూపాయలు లాభం తీసుకొచ్చిన సినిమా ఇది. దిల్‌రాజు కెరీర్‌లోనే ఇది భారీ విజయం. అయితే ఈ విజయపు ఆనందాన్ని `వినయ విధేయ రామ` కాస్త హరించేసింది.
చరణ్ సినిమాకీ, దిల్‌రాజుకీ ఉన్న సంబంధం ఏమిటి? అనుకుంటున్నారా? ఈ సినిమాని నైజాం, ఉత్తరాంధ్రలలో దిల్‌రాజు పంపిణీ చేశారు. ఈ రెండు చోట్లా ఆయనకు దాదాపు 6 కోట్ల నష్టాలొచ్చాయి. అలా `ఎఫ్ 2` లాభాల్లో కొంత `వినయ విధేయ రామ`కి షిఫ్ట్ చేశారన్నమాట. అయినా... ఈమధ్యకాలంలో దిల్‌రాజు పంపిణీ చేసిన సినిమాలేవీ సరిగా ఆడడం లేదు.
`రోబో 2.ఓ` కూడా ఆయనకు చాలా నష్టాల్ని మిగిల్చింది. ఇప్పుడు వినయ విధేయ రామ కూడా దెబ్బ కొట్టింది. `వినయ విధేయ రామ` విడుదలకు ముందే రూ.95 కోట్ల వరకూ బిజినెస్ చేసుకుంది. అందులో కేవలం 60 శాతం మాత్రమే వెనక్కు రాబట్టింది. అంటే దాదాపు రూ.30 కోట్లు నష్టమన్నమాట. అందులో దిల్‌రాజు వాటా ఆరు కోట్ల వరకూ ఉంది.