గ్లామ్‌షాట్‌: బ్లాక్‌ హాట్‌ 'అందాల రాక్షసి'

By iQlikMovies - February 05, 2019 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

'అందాల రాక్షసి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్‌ చెప్పిన బ్యూటీ లావణ్య త్రిపాఠి. 'భలే భలే మగాడివోయ్‌' సినిమాతో అమ్మడి దశ మారిపోయింది. సెన్సేషనల్‌ హిట్‌ అందుకుందీ సినిమాతో. తర్వాత నాగార్జునకు జోడీగా నటించి 'సోగ్గాడే చిన్నినాయనా'తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసేసుకుంది. ప్రస్తుతం 'అర్జున్‌ సురవరం' సినిమాలో నిఖిల్‌కి జోడీగా నటిస్తోంది. ఇటీవల 'అంతరిక్షం' సినిమాలో నటించింది. కానీ ఆశించిన రిజల్ట్‌ అందుకోలేకపోయింది.

 

కానీ అవకాశాలు మాత్రం అంది పుచ్చుకుంటూనే ఉంది. సినిమాల సంగతి ఎలా ఉన్నా, సోషల్‌ మీడియాలో ఈ మధ్య లావణ్య బాగా యాక్టివ్‌ అయ్యింది. హాట్‌ హాట్‌ పోజులతో కుర్రకారుతో తనకెంత ఫాలోయింగ్‌ ఉందో చెక్‌ చేసుకుంటోంది. బాగానే ఫాలోవర్స్‌ ఉన్నారని గ్రహించి, రెగ్యులర్‌గా హాట్‌ పిక్స్‌ని పోస్ట్‌ చేస్తూ నెటిజన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేస్తోంది. తాజాగా ఈ బ్లాక్‌ హాట్‌ కాస్ట్యూమ్‌లో వెనక నుండి లావణ్య హాట్‌ అప్పియరెన్స్‌కి కుర్రకారు ఫిదా తెగ అయిపోతోందిలే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS