సమంత రూటు మార్చేసింది. సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ, గ్లామర్‌కి కాస్త బ్రేక్ ఇచ్చినా, సోషల్ మీడియా వేదికగా గ్లామర్‌తో రెచ్చిపోతోంది. స్క్రీన్ మీద డీగ్లామర్‌కైనా సై అంటోంది. కానీ బయట మాత్రం గ్లామర్ యాంగిల్‌కి బాగా ఛాన్సిచ్చేస్తోంది. బయట అంటే నెట్టింట్లోలెండి. ఈ మధ్య సమంత ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ అవుతున్న పిక్స్‌లో సమంత హాట్ యాంగిల్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
అయితే సమంత ఇప్పుడు ఇంతగా గ్లామర్ డోస్ పెంచేయడానికి కారణమేంటబ్బా అని కొందరు నెటిజన్లు విస్తుపోతున్నారు. ఏది ఏమైనా సమంత అస్సలు తగ్గేలా లేదు. నాగచైతన్యతో పెళ్లి అనుకున్నాక సమంత తనలోని గ్లామర్ యాంగిల్స్‌ని ఎన్ని రకాలుగా బయటపెట్టాలో అన్ని రకాలుగానూ బయట పెట్టేసింది. ఈ విషయమై కాస్త వివాదాస్పదమైంది కూడా ఆ టైంలో. అయినా తన పంథా మార్చుకోలేదు సమంత.
అయితే ఆ తర్వాత 'రంగస్థలం' సూపర్ డూపర్ హిట్ అవ్వడం, ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో సమంత ఇంపార్టెంట్ రోల్స్‌తో ఆకట్టుకోవడం హిట్స్ మీద హిట్స్ కొట్టడం ఇలా వరుసగా జరిగేసరికి అవన్నీ కొట్టుకుపోయాయి. తాజాగా మరోసారి సమంత అదే రేంజ్‌లో విజృంభిస్తోంది. వరుసపెట్టి హాట్ పిక్స్‌తో రెచ్చిపోతోంది. కెరీర్ డల్ అయితేనే ఇలాంటి మ్యాజిక్‌ని ఉపయోగిస్తుంటారు ముద్దుగుమ్మలు. కానీ సమంతకు ఆ పరిస్థితి లేదు. చేతినిండా సినిమాలతో ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ బిజీగా గడుపుతోంది. అయితే సమంత ఎందుకిలా చేస్తోందట చెప్మా.!