మెగా హీరోకి షాక్ ఇచ్చిన సేతుప‌తి.

మరిన్ని వార్తలు

విజ‌య్ సేతుప‌తి... త‌మిళంలో స్టార్ హోదా ద‌క్కించుకున్న హీరో! ఇప్పుడు మ‌న మెగా హీరోకి షాక్ ఇచ్చాడు. మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్ `ఉప్పెన‌` అనే సినిమా రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇందులో ప్ర‌తినాయ‌కుడి పాత్ర కోసం విజ‌య్ సేతుప‌తిని ఎంచుకున్న సంగ‌తి తెలిసిందే.

 

ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి విజ‌య్ సేతుప‌తి త‌ప్పుకున్నాడ‌ని స‌మాచారం. కాల్షీట్లు స‌ర్దుబాటు చేయ‌లేక‌పోతున్నాన‌ని, అందుకే ఈ సినిమా వ‌దులుకోవాల్సివ‌చ్చింద‌ని విజ‌య్‌సేతుప‌తి చెబుతున్నాడ‌ట‌. అయితే అస‌లు కార‌ణాలు వేరే ఉన్నాయ‌ని టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు విజ‌య్‌సేతుప‌తి స్థానంలో ఎవ‌రిని ఎంచుకోవాలా? అని చిత్ర‌బృందం మ‌ల్లగుల్లాలు ప‌డుతోంది. అన్న‌ట్టు చిరంజీవి `సైరా`లోనూ విజ‌య్‌సేతుప‌తి ఓ కీల‌క‌పాత్ర పోషించాడు. ఆ సినిమా షూటింగ్ మాత్రం పూర్త‌య్యింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS