దిల్ రాజు బ్యానర్‌లో `దువ్వాడ జగన్నాథమ్` చేశాడు అల్లు అర్జున్. ఆ తరవాత.. `ఐకాన్` సినిమాకి ప్రకటించారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. అయితే... అనూహ్యంగా పట్టాలెక్కకుండానే `ఐకాన్`కి బ్రేకులు పడ్డాయి. ఆ సినిమాని పక్కన పెట్టి, మిగిలిన ప్రాజెక్టులతో బిజీ అయ్యాడు బన్నీ. పరిస్థితి చూస్తుంటే.. `ఐకాన్`ని పూర్తిగా మర్చిపోవాల్సిందే అనిపించింది.
అయితే.. `వకీల్ సాబ్` హిట్టుతో మళ్లీ రేసులోకి వచ్చాడు వేణు శ్రీరామ్. ఎప్పుడైతే `వకీల్ సాబ్` పెద్ద హిట్టయిందో.. అప్పుడు తనపై నమ్మకాలు పెరిగాయి. `ఐకాన్` మళ్లీ తెరపైకి వచ్చింది. ఒకవేళ బన్నీ కాదన్నా, మరో హీరోతో ఈ సినిమా చేయడానికి దిల్ రాజు ప్లానింగ్స్ వేసుకున్నాడు. ఆ మరో హీరో ప్రభాస్ అయ్యిండొచ్చని వార్తలు వచ్చాయి. అయితే.. దిల్ రాజు మాత్రం `ఐకాన్ హీరో.. బన్నీనే` అంటున్నారు. బన్నీకి ఈ కథ బాగా నచ్చిందని, తాను చేయడానికి సిద్ధంగానే ఉన్నాడని, బన్నీతోనే ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్తుందని దిల్ రాజు స్పష్టం చేశారు. సో.. ఐకాన్ పై ఇంకా ఆశలున్నాయన్నమాట. `పుష్ష` తరవాత.... కొరటాల శివతో బన్నీ ఓ సినిమా చేయాలి. అయితే ఆ ప్లేసులో ఎన్టీఆర్ - కొరటాల సినిమా పట్టాలెక్కుతుంది. కాబట్టి... కొరటాల ప్లేస్.. ఇప్పుడు వేణు శ్రీరామ్ కి దక్కొచ్చు.