ప‌వ‌న్ విష‌యంలో మాట త‌ప్పిన దిల్ రాజు

మరిన్ని వార్తలు

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా టైటిల్ బ‌య‌ట‌కు రావ‌డం అంటే ఎలా ఉండాలి... ? ఫ్యాన్స్ అంద‌రికీ అది పెద్ద పండ‌గ‌లా క‌నిపించాలి. టైటిల్ గురించి చ‌ర్చ జ‌ర‌గాలి. కానీ.. పింక్‌ రీమేక్ విష‌యంలో అలాంటివేం జ‌ర‌గ‌లేదు. సింపుల్‌గా టైటిల్ బ‌య‌ట‌కు వచ్చేసింది. ఈ సినిమాకి 'వకీల్ సాబ్‌' అనే టైటిల్ ఖాయ‌మైపోయింది.

 

ఈ టైటిల్ ముందు నుంచీ ప్ర‌చారంలో ఉన్న‌దే. ఈ సినిమాకి లాయ‌ర్ సాబ్‌` లేదా `వకీల్ సాబ్‌` అనే పేరు పెడ‌తార‌ని ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. కానీ దిల్ రాజు మాత్రం ''ఆరెండు టైటిళ్లూ కాదు.. మ‌రో కొత్త టైటిల్ పెడ‌తాం'' అని గ‌ట్టిగా చెప్పేవాడు. తీరా చూస్తే ముందు అనుకున్న టైటిల్ నే ఫిక్స్ చేశారు.

 

హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ని బ‌ట్టి సినిమా ఉండ‌డానికి ఇది మాస్ సినిమా ఏం కాదు. పింక్ స్టైల్‌లో యునిక్‌గా టైటిల్ పెట్టాల్సింది. కానీ... హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ని దాటి బ‌య‌ట‌కు రాలేక‌పోయింది దిల్ రాజు టీమ్. ఈ సినిమా విష‌యంలోనైనా కొత్త‌గా ఆలోచిస్తారేమో అనుకుంటే, ఆరిస్క్ చేయ‌లేదు. `వకీల్ సాబ్‌` టైటిల్ బాగానే ఉంది. ఇప్ప‌టికే జ‌నం నోటికి వెళ్లిపోయింది కాబట్టి, పాసైపోయిన‌ట్టే. కాక‌పోతే.. దీనికంటే మంచి టైటిల్ వెదికి స‌ర్‌ప్రైజ్ చేస్తే మ‌రింత బాగుండేది. ఈ విష‌యంలో ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి ఇచ్చిన మాట త‌ప్పేశాడు దిల్ రాజు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS