స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 'ఎవరు' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఆడవిశేష్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, 'క్షణం', 'గూఢచారి' సినిమాలతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన అడవిశేష్, ఇప్పుడు 'ఎవరు'తో దిల్‌రాజు మనసు గెలుచుకున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల సంగతి దిల్ రాజుకు పెద్దగా తెలియదంట కానీ, అడవి శేష్ ఎలాంటి నటుడో మాత్రం ఆయనకి అర్ధమైపోయిందట.
అందుకే ఆయనతో ఓ సినిమా తెరకెక్కించాలనుకుంటున్నానన్న తన కోరికను బయట పెట్టాడు. 'ఎవరు' సక్సెస్ మీట్‌కి గెస్ట్‌గా విచ్చేసిన దిల్‌రాజు, అడవిశేష్‌తో సినిమా చేస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చేశాడు. ప్రస్తుతం అడవి శేష్ రెండు సినిమాలు చేయాల్సి ఉంది. మహేష్‌బాబు నిర్మాణంలో చేయాల్సిన సినిమా ఒకటి, మరో బ్యానర్‌లో ఇంకోటి. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే, దిల్‌రాజుకు డేట్స్ ఇచ్చేస్తాడట. రాజుగారు అడిగితే ఎవరైనా కాదనగలరా.? చెప్పండి. అన్నట్లు రాజుగారి దృష్టిని ఒకసారి ఆకర్షిస్తే చాలు, అంత తేలిగ్గా ఆయన వదులుకోరు.
ఒక్క సినిమాతో సరిపెట్టరు కూడా. సో అడవి శేష్ - దిల్ రాజు కాంబోలో కనీసం రెండు సినిమాలైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మరి దిల్ రాజు బ్యానర్‌లో అడవి శేష్ ఎలాంటి కాన్సెప్ట్ మూవీని ఎంచుకుంటాడో చూడాలిక.