'గ్యాంగ్‌లీడర్' ఫస్ట్‌లుక్ పోస్టర్స్, టీజర్‌తో అంచనాలు క్రియేట్ చేశాడు నాని. సక్సెస్‌లు వస్తున్నా, ఈ మధ్య కాస్త సీరియస్ క్యారెక్టర్స్‌లో కనిపిస్తున్న నాని, 'గ్యాంగ్‌లీడర్'లో ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు. కాన్సెప్ట్ పరంగా కూడా 'గ్యాంగ్‌లీడర్' డిఫరెంట్‌గా ఎంటర్‌టైన్ చేసేలా ఉంది. దాంతో 'గ్యాంగ్ లీడర్' నానికి మరో హిట్ ఇస్తుందనుకున్నారంతా. కానీ, ఆగస్ట్ 30న రావల్సిన 'గ్యాంగ్ లీడర్'కి, 'సాహో'తో తొలి దెబ్బ తగిలిందనాలి.
కానీ, 'సాహో'ని మన సినిమా అనీ, మంచి విజయం సాధించాలని కోరుకుంటూ, పూర్తిగా తన సపోర్ట్ అందించిన నాని, తన అభిమానులనే కాదు, ప్రబాస్ అభిమానుల మనసును కూడా గెలుచుకున్నాడు. ఇదంతా బాగానే ఉంది. కానీ, ఆగస్ట్ 30 రిలీజ్ డేట్ 'సాహో'కి ఇచ్చేశాక, సెప్టెంబర్ 13న స్లాట్ బుక్ చేసుకున్నాడు నాని. ఆ స్లాట్‌లో ఆల్రెడీ మెగా ప్రిన్స్ 'వాల్మీకి'తో సిద్ధంగా ఉన్నాడు. ఇక రీసెంట్‌గా విడుదలైన 'వాల్మీకి' టీజర్‌కి వస్తున్న రెస్పాన్స్ బాప్‌రే అనిపిస్తోంది. 'వాల్మీకి'గా వరుణ్ తేజ్ మేకోవర్‌కి ఆశ్చర్యపోవడమే అందరి వంతు అవుతోంది. ఆయన్ని తట్టుకోవడం నానికి సాధ్యమేనా.? అనిపిస్తోంది. కళ్లు మూసినా, కళ్లు తెరిచినా వరుణ్ తేజ్ రూపమే కళ్ల నిండా నిండిపోతుంది.
అందుకే ఫ్యాన్సే కాదు, సెలబ్రిటీ ప్రముఖులు సైతం వరుణ్‌ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. టీజర్ వచ్చాక 'వాల్మీకి'పై అంచనాలు ఆకాశాన్ని అంటేశాయి. అసలే ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. మరి ఈ పరిస్థితి నానికి కొంచెం కష్టమే. కానీ, రెండూ రెండూ ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్స్ కావడంతో, ఓ మోస్తరు టాక్ వచ్చినా, రెండు సినిమాలకూ మంచి ఆదరణ దక్కే అవకాశముంది. చూడాలి మరి, 'వాల్మీకి'తో పోటీ గ్యాంగ్ లీడర్‌కి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో.