'కృష్ణార్జున యుద్ధం' రివ్యూ చెప్పేసిన దిల్ రాజు..!

By iQlikMovies - April 10, 2018 - 18:05 PM IST

మరిన్ని వార్తలు

నాని తన కెరీర్ లో రెండవ సారి ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం కృష్ణార్జున యుద్ధం. ఈ చిత్రం ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నానికి ఈ చిత్రం అగ్నిపరీక్ష అనే చెప్పుకోవచ్చు.

ఇలాంటి తరుణంలో నిన్న ప్రముఖ నిర్మాత-పంపిణీదారుడు అయిన దిల్ రాజు ఈ చిత్రం గురించి మాట్లాడుతూ- ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ బాగా ఉంది అయితే సెకండ్ హాఫ్ లో కాస్త ఎంటర్టైన్మెంట్ తగ్గినప్పటికి కథ బలంగా ఉండడంతో సినిమా అందరికి నచ్చుతుంది అని చెప్పేశారు.

దీనితో ఈ సినిమా గురించిన ఓవరాల్ రివ్యూ ఈయన ఇచ్చేశాడు అని అందరు అభిప్రాయపడుతున్నారు. మొన్నీమధ్యన కూడా రంగస్థలం ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సినిమాలో కొన్ని కీలక అంశాలని బయటకి చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఆ సినిమాకి అలా చెప్పడం ప్లస్ అయింది.

మరి ఈ చిత్రానికి దిల్ రాజు రివ్యూ ఉపయోగపడుతుందా? లేదా? అనేది వేచి చూడాలి...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS