ఆర్.ఆర్.ఆర్‌తో దిల్ రాజు పంట పండింది. ఈ సినిమా నైజాంలో సూపర్ డూపర్ కలక్షన్లతో దూసుకుపోతోంది. ఆర్.ఆర్.ఆర్ సినిమా నైజాం రైట్స్ దిల్ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
రూ.75 కోట్లతో ఈ సినిమా రైట్స్ ఆయన దక్కించుకున్నారు. నైజాంలో ఓ సినిమా ఈ ధరకు అమ్ముడుపోవడం ఓ రికార్డ్! సినిమా మొదలవ్వకముందే.. రాజు నైజాం కోసం ఏకంగా రూ.15 కోట్ల అడ్వాన్స్ ఇచ్చారు. నాలుగేళ్ల పాటు ఆ అడ్వాన్స్‌కి వడ్డీ కూడా కలుపుకోవాల్సివచ్చింది. అప్పుడే.. దిల్ రాజు రిస్క్ చేస్తున్నాడన్నారంతా. అయితే.. ఇప్పుడు దిల్ రాజు నమ్మకమే నిజమైంది. ఈసినిమా నైజాంలో రూ.100 కోట్ల మైలు రాయిని చేరుకుంది. మరో.. 10 కోట్లయినా వసూలు చేయడం ఖాయంలా కనిపిస్తోంది. వడ్డీలన్నీ తీసేసినా..కనీసం 30 కోట్ల లాభం అన్నమాట. సొంతంగా సినిమా తీసినా, ఈ స్థాయిలో లాభాలు రావడం కల్ల. అందుకే.... దిల్ రాజు సైతం ఖుషీలో ఉన్నాడు. సోమవారం ఆర్.ఆర్.ఆర్ టీమ్ అందరినీ పిలిచి.. గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చాడు దిల్ రాజు. నైజాంలో ఈ సినిమా భారీ లాభాల్ని మూటగట్టుకొన్నా.. కొన్ని ఏరియాల్లో బయ్యర్లకు స్వల్ప నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.