సమంత దృష్టి ఇప్పుడు బాలీవుడ్ పై పడింది. రాజ్ డీకేతో కలిసి సమంత ఓ హిందీ సినిమా చేయబోతోంది. దాంతో పాటుగా ఓ వెబ్ సిరీస్ కూడా ఒప్పుకుందని సమాచారం. అక్కడ ఓ పీఆర్ గ్రూపుని, మేనేజర్‌ని నియమించుకుంది సమంత. ఇప్పుడు అక్కడ ఓ ఇల్లు కూడా కొనుగోలు చేసిందని సమాచారం. ముంబై బీచ్ వ్యూ అపార్ట్‌మెంట్‌లో ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసింది తెలుస్తోంది.
ఈ ఫ్లాటు ఖరీదు దాదాపుగా 5 కోట్ల వరకూ ఉంటుందని టాక్. అయితే ఈ ఫ్లాట్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉందని తెలుస్తోంది. ముంబై వెళ్లినప్పుడల్లా.. తన వసతి కోసం ఈ ఫ్లాట్ కొనుగోలు చేసిందని, హైదరాబాద్‌లోనూ... సమంత ఓ ఇల్లు కొనే పనిలో బిజీగా ఉందని తెలుస్తోంది. తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది సమంత. తన పారితోషికం కూడా రూ.2.5 నుంచి రూ.3 కోట్లకు చేరుకుంది. ఈ ఆదాయాన్ని స్థిరాస్తుల రూపంలో మార్చాలని డిసైడ్ అయ్యింది. అందుకే ఇప్పుడు ఫ్లాట్స్, ఇల్లు అంటూ ఆస్తుల్ని సమకూర్చుకుంటోంది. సమంత చేస్తున్న`శాకుంతలమ్`, `యశోద` చిత్రాలు ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి.