ప్రముఖ నిర్మాత దిల్ రాజు పెళ్లి నేడే. లాక్ డౌన్ కారణంగా చాలా సింపుల్ గా ఈ పెళ్లి వేడుక హైదరాబాద్ శివార్లోని ఓ ఫామ్ హౌస్ ప్లాం జరగనుంది. మూడేళ్ళ క్రితం దిల్ రాజు భార్య అనిత అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఆయన ఒంటరిగా జీవిస్తున్నారు. ఇప్పుడు ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పి, కొత్త జీవితం మొదలుపెడుతున్నట్లు ఆయన తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
వధువుకి సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా బయటికి రాలేదు. ఐతే ఆమె దిల్ రాజుకు పాత స్నేహితురాలే. జోష్ సినిమా నుండి ఆమెతో స్నేహం వుందని తెలుస్తుంది. మొత్తానికి రాజుగారు కొత్త జీవితం మొదలుపెట్టడంపై పరిశ్రమ ఆనందం వ్యక్తం చేస్తోంది.