‘నేల టిక్కెట్‌’ భామ ‘రెడ్‌’ హాట్‌ అయ్యిందే.!

మరిన్ని వార్తలు

పిట్ట కొంచెం కూత ఘనం.. అన్న మాట మాళవిక శర్మకి బాగా సరిపోతుందేమో. మాస్‌ మహరాజ్‌ రవితేజతో ‘నేల టిక్కెట్‌’ సినిమాలో నటించిన ఈ భామ, తొలి సినిమాతోనే తన గ్లామర్‌ సత్తా ఏంటో చూపించింది. అయితే, ఆ తర్వాత మరో సినిమా చేయడానికి చాలా ఎక్కువ టైమే తీసుకుంది. ఈలోగా హయ్యర్‌ స్టడీస్‌ కంప్లీట్‌ చేసుకున్న మాళవిక శర్మ, వీలు చిక్కినప్పుడల్లా హాట్‌ హాట్‌ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానుల్ని అలరిస్తూనే వుందనుకోండి. అది వేరే సంగతి. ఈ బ్యూటీ త్వరలో ‘రెడ్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

ఈ సినిమాలో రామ్ పోతినేని హీరో కాగా, కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ‘రెడ్‌’ సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన వీడియో ప్రోమో వచ్చింది. సినిమాలో ‘నువ్వే నువ్వే’ అంటూ సాగే సాంగ్‌ ప్రోమోకి సంబంధించిన వీడియో అది. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే మాళవిక శర్మ గ్లామర్‌ ఈ పాటకి హైలైట్‌ అయ్యేలా వుంది. మేకింగ్‌ వీడియోలోనే అమ్మడి ‘రెడ్‌’ హాట్‌ అందాలు కుర్రకారుకి ఓ రేంజ్‌లో కిర్రాకు పుట్టించేస్తున్నాయి. ఇంతకీ ఈ ‘నేలటిక్కెట్‌’ భామ, ఈ ‘రెడ్‌’ సినిమాతో స్టార్‌డవ్‌ు సంపాదించుకుంటుందంటారా.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS