ఈరోజుల్లో హిట్ టాక్ రావడమే..కష్టం. వస్తే - దాన్ని నిలబెట్టుకోవాల్సిందే. `సినిమా ఫర్వాలేదు` అనే మాట వినిపిస్తే - దాన్ని సూపర్ హిట్ గా మార్చేయడం నిర్మాతల తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో.. దిల్ రాజు మాస్టర్ డిగ్రీ సంపాదించేశాడు. ఆయన సినిమా ప్రమోషన్లు ఆ రేంజులో ఉంటాయి. కేవలం తన ప్రమోషన్ స్కిల్స్ తో యావరేజ్ సినిమాని హిట్ సినిమాగా మర్చేసిన.. సందర్భాలు చాలా ఉన్నాయి.
అయితే.. ఈమధ్య దిల్ రాజు బ్యానర్ నుంచి `షాదీ ముబారక్` అనే ఓ చిన్న సినిమా వచ్చింది. సినిమాకి టాక్ బాగానే ఉన్నా - కలక్షన్లు పరమ వీక్. కనీసం.. థియేటర్ల రెంట్ కి కూడా డబ్బులు రాలేదంటే నమ్మండి. అంత ఘోరంగా వసూళ్లున్నాయి. అయితే..రివ్యూలు బాగానే వచ్చాయి. చూసినవాళ్లు కూడా సినిమా బాగుందన్నారు. సోషల్ మీడియాలో పాజిటీవ్ పోస్టులు పడ్డాయి. కానీ.. వసూళ్లు ఇంత ఘోరంగా ఉండడానికి కారణం.. ప్రమోషన్లు లేకపోవడమే.
ఈ సినిమాని దిల్ రాజు ఏమాత్రం పట్టించుకోలేదని తెలుస్తోంది. దాంతో.. వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఇప్పటి వరకూ ఈసినిమా వసూళ్లు 50 లక్షలు కూడా రాలేదట. దాదాపు 2 కోట్ల మేర బిజినెస్ చేసుకున్న ఈ సినిమాకి ఇంత దారుణమైన వసూళ్లు రావడం.. షాకింగ్ విషయం. ఇదంతా పబ్లిసిటీ లోపమే అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.