మెహబూబా పైన దిల్ రాజు హస్తం

By iQlikMovies - March 24, 2018 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

పూరి జగన్నాధ్ తన కొడుకు ఆకాష్ ని చిత్రసీమకి పరిచయం చేస్తూ తీసిన సినిమా మెహబూబా. ఈ చిత్రానికి సంబందించిన విడుదల మే 11న అవుతుంది అని ప్రకటించారు.

ఇక ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు అయిన దిల్ రాజు విడుదల చేయనున్నారు అని పూరి కనెక్ట్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. దీనితో పూరి జగన్నాధ్ నిర్మించి-దర్శకత్వం చేసిన ఈ చిత్రం పైన అందరికి అంచనాలు పదింతలు అయ్యాయి.

 

ఇప్పటికే మెహబూబా చిత్రం టీజర్ కి అద్బుతమైన రెస్పాన్స్ రావడం ఆ తరువాత ఇప్పుడు దిల్ రాజు విడుదల చేయనుండడంతో ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులని అలరిస్తుంది అన్న అభిప్రాయం ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోయింది.

మరి ఈ నమ్మకాన్ని ప్రేక్షకుల వద్ద ఈ చిత్రం నిలబెట్టుకుంటుందా లేదా అన్నది మే 11న విడుదల అయ్యాక తెలుస్తుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS