నందమూరి కళ్యాణ్ రామ్ తాజా చిత్రం MLA నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక ఈ చిత్రానికి మంచి మాస్ అంశాలు ఉన్న చిత్రంగా టాక్ తెచ్చుకుంది.
ఇక ఈ చిత్రం మొదటిరోజు కలెక్షన్స్ చూస్తే, కళ్యాణ్ రామ్ కెరీర్ మొత్తంలోనే మొదటిరోజు అత్యధికంగా వసూలు అయిన చిత్రంగా ఇది నిలిచింది. ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా రూ 5 కోట్ల (గ్రాస్) వసూలు చేసింది.
లెక్కల ప్రకారం చూస్తే, ఇది చాలా మంచి ఓపెనింగ్స్ క్రింద లేక్కవేసుకోవచ్చు. అయితే ఈరోజు రేపు వచ్చే కలెక్షన్స్ పైన ఈ చిత్రం భవిష్యత్తు ఆధారపడి ఉంది అని తెలుస్తుంది. మరి MLA మూవీ ఈ రెండు రోజుల్లో సేఫ్ అవుతుందా లేదా అనేది ఎల్లుండికి తెలుస్తుంది.
మొత్తానికి కళ్యాణ్ రామ్ రీల్ లైఫ్ MLAగా బాగానే సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు.