సెప్టెంబరు 5న అమేజాన్ లో `వి` సినిమా విడుదల కానుంది. నిజానికి.. ఈ సినిమాని థియేటర్లోనే విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. కానీ... ఎంతకీ థియేటర్ల కు అనుమతులు రాకపోవడంతో - ఓటీటీ వైపు మొగ్గు చూపక తప్పలేదు. అయితే నాని, ఇంద్రగంటి లకు ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. వాళ్ల బలవంతంపైనే.. ఇన్నాళ్లూ... ఈ సినిమాని అట్టిపెట్టుకున్నాడు దిల్ రాజు. కానీ... సడన్ గా అమేజాన్ కి అమ్మేశాడు.
ఇలా ఈ సినిమాని అమ్మేడానికి ప్రధాన కారణం.. దిల్ రాజు అప్పులే అని టాక్. ఈ సినిమాకి సంబంధించి నాని, ఇంద్రగంటిలకు దిల్ రాజు పారితోషికం ఇంకా చెల్లించలేదని టాక్. సినిమా విడుదలైన తరవాత.. వచ్చిన డబ్బులతో పారితోషికాలు క్లియర్ చేద్దామనుకున్నాడట. కానీ.. ఎంతకీ థియేటర్లు తెరవకపోయే సరికి... ఆ బాకీలు బాకీల్లానే ఉండిపోయాయని, వాటిని క్లియర్ చేయడానికే సినిమాని అమ్మాల్సి వచ్చిందని తెలుస్తోంది. దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాతలకు అప్పులేంటి? అనే అనుమానం రావొచ్చు. కొంతమంది ప్రొఫెషన్ నిర్మాతలకు ఏ సినిమా లెక్క దానిదే. సినిమా మొదలెట్టే ముందు కొంత అడ్వాన్స్ ఇస్తారు. సినిమా పూర్తయ్యాక, బిజినెస్ జరిగాక మిగిలిన మొత్తం ఇస్తారు. ఈ సినిమా పూర్తయినా, బిజినెస్ జరక్కపోవడంతో ఎవరి బాకీలు అలానే ఉండిపోయాయి. అవి ఇప్పుడు అమేజాన్ కి అమ్మడం ద్వారా క్లియర్ అయ్యాయి.