'వినయ విధేయ రామ' విషయమేంటంటే.!

By iQlikMovies - January 01, 2019 - 17:30 PM IST

మరిన్ని వార్తలు

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తాజా చిత్రం 'వినయ విధేయ రామ' ప్రమోషన్స్‌ విషయంలో పక్కా స్ట్రేటజీని ఫాలో చేస్తున్నారు. మొట్ట మొదటగా విడుదలైన ఫస్ట్‌లుక్‌ తీసుకుంటే, పక్కా మాస్‌ అండ్‌ యాక్షన్‌ లుక్‌ని విడుదల చేశారు. దాంతో సినిమా టైటిల్‌కీ, ఈ లుక్‌కీ సంబంధం ఏమై ఉంటుందనే క్రమంలో బోయపాటి గత సినిమా 'జయ జానకీ నాయకా'తో ఈ సినిమాని పోల్చి చూశారు. 

 

అయితే ఆ తర్వాత వచ్చిన వినయ విధేయ రాముని విధేయత కలిగిన లుక్‌తో ఆలోచనలు మారిపోయాయి. టైటిల్‌కి సినిమా యాప్ట్‌ అని కనెక్ట్‌ అయ్యారు. తర్వాత రాంబో లుక్‌తో హాలీవుడ్‌ హీరోని తలపించారు. తాజా లుక్‌ విషయానికి వస్తే, హీరోయిన్‌ని చేత్తో ఎత్తుతున్న ఈ లుక్‌కి వస్తున్న రెస్పాన్స్‌ అసలు మామూలుగా లేదు. ఇంతకంటే బెస్ట్‌ లుక్‌ ఇంకేముంటుంది.? అని మెగా అభిమానులే కాదు, అభిమానేతరులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

 

హీరోయిజాన్ని పీక్స్‌లో చూపించడంలో బోయపాటి దిట్ట. అలాంటిది మెగా పవర్‌స్టార్‌ని ఇంకెంతలా చూపించి ఉంటాడో కదా ఈ సినిమాలో. ఏది ఏమైనా ప్రమోషన్స్‌ విషయంలో చరణ్‌ అండ్‌ బోయపాటి చేస్తున్న ప్లానింగ్‌ సూపర్బ్‌ అంతే. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. డివివి దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందించాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS