మలయాళ చిత్రపరిశ్రమలో నటి భావన కిడ్నాప్, అత్యాచార యత్నానికి సంబందించిన ఘటన యావత్ దేశాన్ని ఒక కుదుపు కుదిపేసింది అనే చెప్పాలి.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ మలయాళ హీరో దిలీప్ ని మూడు నెలల క్రితం పోలీసులుఅరెస్ట్ చేసి జైలుకి తరలించారు. ఇక ఈ కేసుతో తనకెటువంటి సంబంధం లేదు అంటూ తనకి బెయిల్ మంజూరు చేయమని ఇప్పటికే తిరువనంతపురం కోర్టులో నాలుగు సార్లు ఆర్జీ పెట్టుకున్నాడు.
అయితే ప్రతిసారి బెయిల్ రద్దవ్వడం జరిగింది. కాని అయిదవ సారి ఈ రోజు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆయన నేడు విడుదల అయ్యారు. ఆయన భయటకి రాగానే అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని దిలీప్ కి ఘన స్వాగతం పలికారు.
ఈ బెయిల్ ప్రకారం ఆయన విదేశాలు వెళ్ళకూడదు అలాగే టీవీ, న్యూస్ పేపర్స్ లో ఎటువంటి బెదిరింపులకి పాల్పడొద్దు అని ఆదేశాలు జారి చేసింది హైకోర్టు.