న‌న్నెవ‌రూ త‌ప్పించ‌లేదు: బాలా క్లారిటీ

By iQlikMovies - February 10, 2019 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

తెలుగులో సంచ‌ల‌నాలు సృష్టించిన `అర్జున్ రెడ్డి` సినిమాని త‌మిళంలో `వర్మ‌` పేరుతో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు త‌మిళ నాట హాట్ టాపిక్‌గా మారింది. `వ‌ర్మ‌` సినిమా అవుట్ పుట్ పై అసంతృప్తిగా ఉన్న చిత్ర‌బృందం... చిత్రీక‌ర‌ణ నిలిపివేసింది.

 

అంతేకాదు... ఆయా స‌న్నివేశాలన్నీ మ‌ళ్లీ రీషూట్ చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ద‌ర్శ‌కుడు బాల ప‌నితీరు కూడా నిర్మాత‌ల‌కు న‌చ్చ‌లేద‌ని, అందుకే బాలాని తొల‌గించార‌ని వార్త‌లొచ్చాయి. వీటిపై ఇప్పుడు బాలా స్పందించాడు. ఈ సినిమా  త‌నను ఎవరూ తప్పించలేదని. తానే ప్రాజెక్ట్‌ ను వదిలి బయటకు వచ్చేశానని తెలిపారు. 

 

నిర్మాణ సంస్థతో తాను చేసుకున్న అగ్రిమెంట్‌ కాపీలను కూడా విడుదల చేశారు. ధృవ్‌ విక్రమ్‌ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నానని బాలా పేర్కున్నారు. ఆయ‌న స్థానంలో ద‌ర్శ‌కుడిగా ఎవ‌రైనా వ‌స్తారా?  లేదంటే మొత్తంగా ఈ సినిమాని ఆపేశారా?  అనేది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS