దర్శకుడు మహి.వి.రాఘవ తెరకెక్కించిన 'యాత్ర' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఏమాత్రం అంచనాల్లేకుండా విడుదలైన ఈ సినిమాకి యావరేజ్ టాక్ దక్కించుకుంది. ఫర్వాలేదు అనిపించుకుంది. బాగానే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ అభిమానులు చాలా బాగుందని చెబుతుంటుంటే, ఇతరులు డాక్యుమెంటరీలా ఉందంటున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే వసూళ్లు మాత్రం బాగానే కనిపిస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌తో రూపొందడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. అయితే సినిమాలో రాజశేఖర్‌రెడ్డిని గొప్పగా చూపించేందుకుగాను, కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు, టీడీపీ, కాంగ్రెస్ అభిమానులకీ మధ్య ఈ 'యాత్ర' సినిమా చిచ్చు పెట్టింది. ఈ క్రమంలో దర్శకుడిపై విమర్శలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి.
కాగా మహి.వి.రాఘవ్ 'యాత్ర' వివాదం గురించి తాజాగా స్పందిస్తూ నేను నమ్మిన విషయాన్ని నాకు తెలిసిన మాధ్యమం సినిమా ద్వారా చూపించాను. నన్ను అభినందిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. రాజశేఖర్‌రెడ్డి గొప్ప నాయకుడు. ఆయన్ని ఇంత బాగా చూపించే అవకాశం కలిగినందుకు దర్శకుడిగా గర్వపడుతున్నాను. కానీ నేనెవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. అంతిమంగా ఇది ఒక సినిమా. నా దృష్టిలో రాజశేఖర్‌రెడ్డి నేనిచ్చిన ఘన నివాళి అని పేర్కొన్నాడు సోషల్ మీడియాలో మహి.వి. రాఘవ.