పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈమధ్య వరసగా సినిమాలను లైన్లో పెడుతున్న సంగతి తెలిసిందే. 'వకీల్ సాబ్' తో పాటుగా క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా, హరీష్ శంకర్ డైరెక్షన్లో మరో సినిమా ఫిక్స్ అయ్యాయి. ఇవి కాకుండా డాలీ దర్శకత్వంలో మరో సినిమాకు పచ్చజెండా ఊపారని అంటున్నారు. ఈ సినిమాను రామ్ తాళ్ళూరి నిర్మిస్తారని, పవన్ కళ్యాణ్-రవి తేజ కాంబినేషన్ లో ఓ భారీ మల్టిస్టారర్ గా తెరకెక్కిస్తారట. ఈ సినిమా కోసం మొదట 'విక్రమ్ వేద' రీమేక్ చెయ్యాలని అనుకున్నారట. మరో తమిళ సినిమాను కూడా పరిశీలించాట.
అయితే వాటిని మన నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేర్పులు చెయ్యాల్సి వస్తోందని, అందుకే ఓ కొత్త స్క్రిప్ట్ తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నారట. పవన్ - రవి తేజ ఇమేజ్ కు తగ్గట్టుగా ఓ పవర్ఫుల్ కథను వండివార్చే పనిలో ఇప్పుడు డాలీ బిజీగా ఉన్నారని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన రానుందట. పవన్ - రవి తేజ ఇద్దరూ మాస్ ప్రేక్షకుల్లో పట్టున్నవారు. ఇద్దరూ కలిసి నటిస్తే ఇక ఆ ఎనర్జీ, జోష్ చూసేందుకు రెండు కళ్ళు చాలవు. మరి డాలీ వీరిద్దరి కోసం ఎలాంటి కథ రెడీ చేస్తారో వేచి చూడాలి.