రామ్‌తో పూరి... ప‌క్కా అయ్యింది!

By iQlikMovies - December 25, 2018 - 11:03 AM IST

మరిన్ని వార్తలు

ఎన‌ర్జిటిక్ రామ్‌... ఎక్కువ‌గా కొత్త ద‌ర్శ‌కుల‌తోనే సినిమాలు తీస్తున్నాడు. త‌న బాడీ లాంగ్వేజ్‌కీ, ఎంచుకున్న క‌థ‌ల‌కూ వాళ్లే న్యాయం చేస్తున్నారు. పెద్ద ద‌ర్శ‌కులు, అనుభ‌వ‌జ్ఞుల‌వైపు చూడ‌డం లేదు రామ్‌. అయితే తొలిసారి.. ఓ అగ్ర ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌బోతున్నాడు.

 

ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు... పూరి జ‌గ‌న్నాథ్‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతోంద‌ని గ‌త కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌ర‌గుతోంది. ఇప్పుడు అదే నిజ‌మైంది. రామ్ క‌థానాయ‌కుడిగా ఓ సినిమా చేస్తున్న‌ట్టు పూరి జ‌గ‌న్నాథ్ ప్ర‌క‌టించారు. పూరీ టూరింగ్ టాకీస్ పై ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. లావ‌ణ్య స‌మ‌ర్ప‌కురాలిగా వ్య‌వ‌హ‌రిస్తారు. స్క్రిప్టు ప‌నులు పూర్త‌య్యాయి. 

 

జ‌న‌వ‌రిలో షూటింగ్ ప్రారంభిస్తారు. మేలో ఈ సినిమాని విడుద‌ల చేస్తారు. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారు. `హ‌లో గురు ప్రేమ‌కోస‌మే` త‌ర‌వాత రామ్ చేస్తున్న సినిమా ఇదే. మ‌ధ్య‌లో ప్ర‌వీణ్ స‌త్తారుతో ఓ సినిమా మొద‌లెట్టారు. కానీ బ‌డ్జెట్ కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఆ స్థానంలోనే పూరి సినిమా ప‌ట్టాలెక్కుతోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS