స్టైల్‌ స్టైల్‌గా వినయ విధేయ రాముడొచ్చాడు.!

మరిన్ని వార్తలు

బోయపాటి మెగా ఫ్యాన్స్‌ కోరిక తీర్చాడు. బోయపాటి తాజా చిత్రం 'వినయ విధేయ రామ' నుండి విడుదలవుతున్న పోస్టర్స్‌లో చెర్రీ ముఖాన్ని సరిగ్గా చూపించడం లేదనే కామెంట్స్‌ ఎదుర్కొంటున్నాడు ఈ మధ్య బోయపాటి శీను. అయితే తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన కొత్త స్టిల్‌ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తోంది. వెరీ వెరీ స్టైలిష్‌ లుక్‌లో పక్కా క్లాస్‌ కాస్ట్యూమ్‌లో చెర్రీ కేక పుట్టిస్తున్నాడు. ఈ స్టిల్‌కి మెగా ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు. వాస్తవానికి చెప్పాలంటే ఈ పోస్టర్‌లో కూడా చెర్రీ స్టైలే కనిపిస్తోంది. అయినా కానీ ఆ స్టైల్‌కే సంబరపడిపోతున్నారు అభిమానులు.

శరవేగంగా ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ నెలాఖరుకే షూటింగ్‌ పనులు పూర్తి చేసుకుని సినిమా ప్రమోషన్స్‌ షురూ చేయనుంది చిత్ర యూనిట్‌. ఈ సినిమాలో కైరా అద్వానీ, చరణ్‌కి జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్‌గా నటిస్తున్నాడు. బోయపాటి సినిమాలంటే స్క్రీన్‌ నిండా తారలతో కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. అలా ఈ సినిమాలో కూడా తారలకేం లోటు లేదు. ఆర్యన్‌ రాజేష్‌, ప్రశాంత్‌, స్నేహ తదితర నటీనటులతో స్క్రీన్‌ కలర్‌ఫుల్‌గా నిండిపోనుందనీ, ఆల్రెడీ 'తందాన..' ఫ్యామిలీ సాంగ్‌తో బోయపాటి చూపించేశాడు.

టోటల్‌గా మాస్‌, క్లాస్‌ అన్ని రకాల కమర్షియల్‌ అంశాల్నీ పుష్కలంగా చూపించబోతున్నాడు 'వినయ విధేయ రాముడి'తో. ఇంకా ఇవే కాక చాలా చాలా సర్‌ప్రైజ్‌లు ఈ సినిమాలో ప్లాన్‌ చేశాడట బోయపాటి శీను. అవన్నీ చూసేందుకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ ఫర్‌ సంక్రాంతి. సంక్రాంతికి ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా విడుదల కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS