‘కాటమరాయుడు’తో ఇంకోస్సారి అంటోన్న ఆ డైరెక్టర్‌.!

మరిన్ని వార్తలు

డైరెక్టర్‌ డాలీ (కిషోర్‌ కుమార్‌ పార్ధసాని) ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ని కలిశారట. ఓ సినిమా నిమిత్తమే డాలీ, పవన్‌ని కలిశారని అంటున్నారు. ఓ పవర్‌ఫుల్‌ స్టోరీ కూడా వినిపించాడని మాట్లాడుకుంటున్నారు. గతంలో పవన్‌ కళ్యాణ్‌తో ‘గోపాలా గోపాలా’, ‘కాటమరాయుడు’ చిత్రాల్ని తెరకెక్కించిన దర్శకుడు డాలీ. ‘కాటమరాయుడు’ ఆశించిన రిజల్ట్‌ అందుకోలేదు. కానీ, ‘గోపాలా గోపాలా’ మంచి సక్సెస్‌ అందుకుంది. ఇక ప్రస్తుతం డాలీ, పవన్‌ కోసం ఓ సక్సెస్‌ఫుల్‌ ప్రాజెక్ట్‌ సిద్ధం చేశాడట. ఇదిలా ఉంటే, ‘పింక్‌’ రీమేక్‌తో పవన్‌ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

 

ఈ విషయం తెలిసి, ఆయనతో సినిమాులు తెరకెక్కించేందుకు చాలా మంది డైరెక్టర్లు క్యూ కట్టేసిన సంగతీ తెలిసిందే. వీరిలో ఇప్పటికే వేణు శ్రీరామ్‌ (‘వకీల్‌ సాబ్‌’ డైరెక్టర్‌) తర్వాత, క్రిష్‌ జాగర్లమూడి, హరీష్‌ శంకర్‌ కన్‌ఫామ్‌ అయ్యారు. క్రిష్‌ దర్శకత్వంలో ఆల్రెడీ సినిమా సెట్స్‌పైకెళ్లినట్లే. వీటితో పాటు, నాలుగు, ఐదు, ఆరు ప్రాజెక్టులు పవన్‌ కళ్యాణ్‌ లైన్‌లో పెట్టేశాడనీ అంటున్నారు. అయితే, మూడు సినిమాల డైరెక్టర్లు కన్‌ఫామ్‌ అయ్యారు. మరి ఆ నాలుగు, ఐదు, ఆరు సినిమాలకు సంబంధించి డైరెక్టర్స్‌ ఎవరా? అనే విషయంలో ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఆ లిస్టులోనే కిషోర్‌ కుమార్‌ పార్ధసాని అలియాస్‌ డాలీ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఇటీవల డాలీ, పవన్‌ని మీట్‌ అయ్యింది అందులో భాగమేనా.? లేక స్నేహపూర్వకమైన మీటింగ్‌నా.? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ పవన్‌ నుండి మాట తీసుకుంటే మాత్రం పవన్‌ మాట తప్పే ప్రశక్తే లేదు. మూడోసారీ ఈ కాంబినేషన్‌ కన్‌ఫామ్‌ అయినట్లే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS