మన దక్షిణాది కథలపై బాలీవుడ్ కి మమకారం పెరిగిపోయింది. ఎప్పుడైతే.. మన అర్జున్ రెడ్డి బాలీవుడ్లో రెండొందల కోట్లు గుంజుకుందో, ఎప్పుడైతే మన బాహుబలి అక్కడ రికార్డులన్నీ బద్దలు కొట్టిందో అప్పటి నుంచీ మన కథలపై మరింత ప్రేమ పెరిగింది. విజయ్ దేవరకొండ నటించిన `డియర్ కామ్రేడ్` సినిమాని కరణ్ జోహార్ ఎప్పుడో కొన్నాడు. హిందీలో రీమేక్ చేస్తానని ప్రకటించాడు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు `వరల్డ్ ఫేమస్ లవర్` రీమేక్ హక్కులు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి.
ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అయినా సరే.. హిందీలో రీమేక్ చేస్తా... అంటున్నాడు కరణ్ జోహార్. ఈ కథ తెలుగులో పెద్దగా వర్కవుట్ అవ్వకపోయినా, హిందీ ఆడియన్స్ని పట్టేసే లక్షణాలున్నాయని కరణ్ భావిస్తున్నాడట. హిందీలో కూడా విజయ్ దేవరకొండనే హీరో అయ్యే ఛాన్సులున్నాయి. `డియర్ కామ్రేడ్` విషయంలోనూ ఇలానే తొందరపడ్డాడు కరణ్. తీరా చూస్తే ఆ సినిమా రీమేక్ చేయలేదు. ఇప్పుడు ఇదీ అంతేనా.. లేదంటే రిస్కు తీసుకుంటాడా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఓపిక పట్టాలి.