ముద్దుగుమ్మ అందానికి సొట్ట బుగ్గలు తోడైతే, వచ్చే అందమే వేరు. అలా సొట్ట బుగ్గల సుందరాంగులు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తుంటారు. నిన్న మొన్నటి వరకూ సొట్ట బుగ్గల సిన్నది అంటే, తాప్సీ పన్ను గురించే మాట్లాడుకునే వాళ్లం. కానీ, ఈ జనరేషన్‌కి మరో సొట్టబుగ్గల సిన్నది పుట్టుకొచ్చింది. ఆమె ఎవరో కాదు, కృతి శెట్టి. ‘ఉప్పెన’ సినిమాతో ఈ ముద్దుగుమ్మ పరిచయమవుతోంది. ఇంకా సినిమా రిలీజ్ కాకుండానే ఈ సిన్నది చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు, ప్రమోషన్స్‌లో భాగంగా వదిలిన ‘ఉప్పెన’ సాంగ్ ప్రోమోస్‌లో కృతి శెట్టి మెయిన్ అట్రాక్షన్ అయ్యింది. క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో హీరోనే కాదు, కుర్రకారును కూడా తన ప్రేమ వలలో బంధించేస్తోంది. ఇకపోతే, ఆడియన్స్‌తో పాటు, ఫిలిం మేకర్స్నీ విశేషంగా ఆకర్షిస్తున్నట్లే ఉంది. అప్పుడే మరో ఛాన్స్ కొట్టేసింది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా ఎంపికైందట. ‘కార్తికేయ 2’తో పాటు, ఇటీవల నిఖిల్ మరో సినిమానీ లాంఛ్ చేశాడు. ‘18 పేజీలు’ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకి సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, ఆయన శిష్యుడు సూర్య ప్రతాప్ డైరెక్షన్ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పిస్తుండగా, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. క్యూట్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి హీరోయిన్గా నిఖిల్ సరసన కృతి శెట్టి అయితే బావుంటుందని ఆమెని ఫైనల్ చేశారత. చూస్తుంటే, మొదటి సినిమా రిలీజ్‌కి ముందే, ఈ పాప మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు పట్టేసేటట్టే కనిపిస్తోంది.