తెలుగు చిత్రసీమలో ప్రామిసింగ్ డైరెక్టర్లలో మారుతి ఒకరు. ఈరోజుల్లో, బస్ స్టాప్, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి హిట్ చిత్రాలు మారుతి ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు సాయిధరమ్ తేజ్‌తో `ప్రతిరోజూ పండగే` సినిమా చేస్తున్నాడు. ఈలోగా మారుతికి బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. అదీ.. `మహానుభావుడు` రీమేక్ కోసం. శర్వానంద్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. తెలుగులో మంచి వసూళ్లు వచ్చాయి. శర్వా కెరీర్లో ది బెస్ట్‌గా నిలిచింది.
ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని ఫిక్సయ్యార్ట. ఇద్దరు హీరోలు కూడా ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఆ రీమేక్ బాధ్యతలు మారుతిపైనే పడ్డాయని తెలుస్తోంది. ఇది వరకు ప్రేమకథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్ సినిమాలూ హిందీలో తీసుకెళ్దామనుకున్నారు. కానీ కుదర్లేదు. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.