మారుతి మనసులోని హీరో ఎవరంటే.!

మరిన్ని వార్తలు

అంతవరకూ కొత్త స్టార్స్‌తో బీ, సీ గ్రేడ్‌ సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్‌ మారుతి, నానితో ‘భలే భలే మగాడివోయ్‌’ సినిమా తెరకెక్కించి బంపర్‌ హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత మారుతి వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస హిట్స్‌తో ఓ మోస్తరు స్టార్‌ డైరెక్టర్స్‌ రేంజ్‌కి వెళ్లిపోయాడు. రీసెంట్‌గా మెగా కాంపౌండ్‌ హీరో సాయి తేజ్‌తో ‘ప్రతిరోజూ పండగే’ అంటూ ఓ ఫ్యామిలీ హిట్‌ కొట్టి, సత్తా చాటాడు. ఇక ఇప్పుడు మారుతి తదుపరి సినిమాపై ఆసక్తి నెలకొంది. గత కొంతకాంగా మారుతి, ఓ స్టార్‌ హీరోపై కన్నేశాడనే టాక్‌ వినిపిస్తోంది కానీ, సదరు స్టార్‌ హీరో నుండి గ్రీన్‌ సిగ్నల్‌ రావడం లేదట.

 

ఈ లోగా మారుతికి సక్సెస్‌ టేస్ట్‌ చూపించిన నాని కోసమే తాజాగా ఓ స్క్రిప్టు సిద్ధం చేస్తున్నాడనే ప్రచారం విస్తృతంగా జోరందుకోవడంతో, మారుతి స్పందించారు. తన తాజా మూవీ నానితో కాదనీ, అయినా, తానింత వరకూ ఏ హీరోనీ కన్‌ఫామ్‌ చేయలేదనీ, ప్రస్తుతం స్క్రిప్టు పనులు మాత్రమే జరుగుతున్నాయి.. త్వరలోనే పూర్తి వివరాలతో తన లేటెస్ట్‌ ప్రాజెక్ట్‌ని ప్రకటిస్తాననీ మారుతి స్పష్టం చేశారు. అయినా, గాసిప్‌ దారులు సృష్టించే గాసిప్స్‌ మాత్రం ఆగడం లేదు. రవితేజ అనీ, కాదు కాదు, ఓ యంగ్‌ హీరో అనీ, ఇంకా కాదు మరొకరు అంటూ.. రకరకాల గాసిప్స్‌ గుప్పు గుప్పుమంటూనే ఉన్నాయ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS