మోక్షజ్ఞ ని పక్కన పెట్టి ప్రభాస్ కోసం ప్రశాంత్ కథ

మరిన్ని వార్తలు

హనుమాన్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు ప్ర‌శాంత్ వ‌ర్మ. అప్పటినుంచి ప్రతిసారి ఏదో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయటం వెంటనే ఆగిపోవటం జరుగుతోంది. హనుమాన్ మూవీ తరవాత బాలీవుడ్ హీరోలు చాలా మంది ప్రశాంత్ పై ఆసక్తిగా చూపారు. ఈ క్రమంలో రణ్వీర్ సింగ్ తో ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు సిద్ధం అయ్యింది. అది కూడా మైతిలాజికల్ ఎలిమెంట్స్ తో. తరవాత కొన్ని రోజులకే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. నెక్స్ట్ హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ ప్రారంభించాడు. ఇందులో కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి హనుమాన్ పాత్రలో నటిస్తున్నాడు. అదే టైంలో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ తో ఒక మూవీ అనౌన్స్ చేసాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. డిసెంబరు 4 న మూహూర్తం అని కూడా అనుకున్నారు.

ఇప్పడు ఈ ప్రాజెక్ట్ మిస్ అయినట్లు తెలుస్తోంది. కారాణాలు పెద్దగా బయటికి రాకపోయినా బాలయ్య మోక్షజ్ఞ లాంచింగ్ బాధ్యతలు కల్కి దర్శకుడు నాగశౌర్యకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ ప్రభాస్ తో చేయబోయే సినిమాపై దృష్టి సారించాడట. అదేంటి ప్రభాస్ ఫుల్ బిజీ కదా, ఎప్పుడు డేట్స్ ఇస్తాడు ప్రశాంత్ వర్మ ఎప్పుడు సినిమా తీయాలని ప్రశ్నిస్తున్నారు. ముందు నుంచి ప్ర‌భాస్, ప్ర‌శాంత్ కాంబోలో ఓ సినిమా వ‌స్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఇప్పడు మోక్షజ్ఞ మూవీ ఆగిపోవడంతో ప్ర‌భాస్ సినిమాపై వర్క్ చేస్తున్నాడట ప్రశాంత్.

అంతే కాదు అందరినీ సర్ప్రైజ్ చేసే న్యూస్ కూడా వినిపిస్తోంది. జ‌న‌వ‌రిలో ప్ర‌భాస్ తో మూవీ అనౌన్స్ చేస్తాడట ప్రశాంత్. మొన్నటి వరకు హోంబలే ప్రొడక్షన్ లో ప్రభాస్ సినిమాకి రిషబ్ శెట్టి కథ అందిస్తారని ప్రచారం జరిగినా, ఇప్పడు ప్రశాంత్, ప్రభాస్ కాంబో మూవీకి రిష‌బ్ శెట్టి క‌థ అందిస్తున్నాడ‌ని సమాచారం. కానీ ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాటిక్ యూనివ‌ర్స్ లోనే ఈ కథ కూడా ఉంటుందని తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS