రకుల్‌ పెంచట్లేదు, తగ్గింది నాగ్‌ మాత్రమే!

మరిన్ని వార్తలు

'మన్మథుడు-2' సినిమా కోసం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ని కొంచెం బొద్దుగా తయారవమని నాగార్జున సూచించాడంటూ గాసిప్స్‌ విన్పించిన విషయం విదితమే. బాలీవుడ్‌ సినిమా 'దే దే ప్యార్‌ దే' కోసం బాగా సన్నగా తయారైపోయిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, అదే ఫిజిక్‌తో 'మన్మథుడు-2' సినిమాలో కన్పిస్తే బావుండదని నాగ్‌ భావించాడనేది ఆ గాసిప్స్‌ సారాంశం. అయితే, ఇలాంటి విషయాల్లో నాగార్జున పెద్దగా పట్టించుకోడని తేలింది. దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ ఈ విషయం స్పష్టం చేశాడు. 

 

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇప్పటికే 'మన్మథుడు-2' సినిమా షూటింగ్‌లో పాల్గొంటోందని వివరించాడు. ఇంకో వైపు, నాగార్జున ఫిట్‌గా వున్న కొన్ని ఫొటోల్ని (షూటింగ్‌ స్పాట్‌కి సంబంధించినవి) విడుదల చేసింది 'మన్మథుడు-2' టీమ్‌. అంటే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నాజూకు అందాన్ని మ్యాచ్‌ చేయడానికి అక్కినేని నాగార్జున 59 ఏళ్ళ వయసులో మరింత ఫిట్‌గా కనిపించబోతున్నాడన్నమాట. నాగార్జునకి 59 ఏళ్ళు అంటే ఎవరైనా నమ్మగలరా? 

 

తన తరం హీరోల్లో నాగ్‌ మాత్రమే పూర్తి ఫిట్‌నెస్‌తో కన్పిస్తుంటాడు. అదే ఆయన ప్రత్యేకత. అరవయ్యేళ్ళకు చేరువలో వున్న నాగార్జున, పాతికేళ్ళ కుర్రాడిలా తెరపై కన్పిస్తే, 'మన్మథుడంటే ఇతడే' అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. నాగార్జున, సోనాలి బింద్రే జంటగా గతంలో వచ్చిన 'మన్మథుడు' సినిమాకి సీక్వెల్‌గా 'మన్మథుడు-2'ని తెరకెక్కిస్తున్నారు. దీనితోపాటే, 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకి సీక్వెల్‌ ఆలోచనలో వున్నాడు నాగార్జున.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS